కలం, వెబ్ డెస్క్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(సర్) చివరి దశకు చేరుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అర్హులైన ఒక్కరి ఓటు కూడా మిస్ కావొద్దని.. ప్రజలకు సహకరించాలని బీఆర్ఎస్ నేతలు, బూత్ లెవల్ ఏజెంట్లను ఆదేశించారు. ఈ మేరకు తన నివాసంలో సర్ ఫారాలు నింపి.. ఎన్నికల అధికారులకు అప్పగించారు. కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు వివరాలు నింపుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇంకో పది రోజులే..
సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్లు ఫారాలను నింపి ఈ నెల 24వ తేదీలోగా అప్పగించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అలా అప్పగించనివారి ఓటు కొత్తగా విడుదలయ్యే జాబితాలో ఉండదు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోందని.. గడువు పెంచాలని అన్ని పార్టీల నేతలు ఈసీని కోరుతున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది.

