కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ (BRS) SIR కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కర్నె ప్రభాకర్, ఎల్ రమణ, సుమిత్రానంద్, సతీష్ రెడ్డి, అభిలాష్ రంగినేని కలిశారు. తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో SIR కార్యక్రమం జరుగుతోందని, కానీ బూత్ లేవల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పనిచేయటం లేదని ఆరోపించారు. సర్ ప్రక్రియపై టెక్నికల్‌గా కొన్ని అనుమానాలు ఉన్నాయని.. వీటిపై కొన్ని ప్రశ్నలు అడిగిన ఎలక్షన్ కమిషన్ నుంచి సమాధానం లేదన్నారు. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కొన్ని కోర్టు కేసులు ఎదుర్కుంటున్నాయని బీఆర్ఎస్ (BRS) నాయకులు గుర్తు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియలో లోటుపాట్లు అనేకరకాలుగా ఉన్నాయని.. వీటి గురించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వివరించామన్నారు. సర్ కు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమయం సరిపోదని మళ్ళీ పొడిగించాలి అని కోరామని అయినా ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ ప్రక్రియపై ఉన్న అనేక పిటిషన్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

