ప‌వ‌న్‌పై వైసీపీ ట్రోల్స్‌.. తిరుప‌తి పీఎస్‌కు చేరిన ర‌చ్చ‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇటీవ‌ల ముంబైలో శ‌స్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan)పై వైసీపీ (YSRCP) ట్రోల్స్ చేస్తోంద‌ని (YSRCP Trolls) జ‌న‌సేన నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తిపై సోష‌ల్ మీడియాలో ఇలాంటి హేయ‌మైన పోస్టులు చేయ‌డం త‌గ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఎన్నిసార్లు చెప్పినా ఆ పార్టీ నాయ‌కులు విన‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం తిరుప‌తి ఈస్ట్ పోలీస్ స్టేష‌న్‌లో జ‌న‌సేన నాయ‌కుడు, తిరుప‌తి ఇన్‌చార్జ్‌ కిర‌ణ్ రాయ‌ల్ ఆధ్వ‌ర్యంలో ప‌లువురు నాయ‌కులు దీనిపై ఫిర్యాదు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోగ్య ప‌రిస్థితిపై దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని, ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>