కలం, వెబ్ డెస్క్ : తమిళ హీరో, టీవీకే అధినేత విజయ్ (Actor Vijay) కి మలేషియా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 27న మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా గ్రాండ్ లాంచ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆ దేశ పోలీసులు హెచ్చరిస్తూ ఆంక్షలు విధించారు. కాగా, ఈ ఆడియో లాంచ్ కు భారీగా జనాలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జన నాయగన్ (Jana Nayagan) సినిమా సంక్రాంతి సమయంలో జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Read Also: ముంబైని కాపాడడానికే కలిశాం.. ఠాక్రే సోదరులు
Follow Us On: Sharechat


