తరతరాలుగా వస్తున్న ఆచారం.. గద్వాలలో ‘మట్టెద్దుల అమావాస్య’

కలం, జోగుళాంబ గద్వాల: జోగుళాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో రైతులు ‘మట్టెద్దుల అమావాస్య’ (Matteddula Amavasya) ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి అనంతరం వచ్చే ఈ అమావాస్య రోజు ఒండ్రు మట్టితో తయారు చేసిన మట్టెద్దులను వ్యవసాయ భూములు ఉన్నవారు మట్టెద్దులను కొనుగోలు చేసి, గరక, పూలు, పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేశారు.

పండుగను పురస్కరించుకొని భక్షాలు (బొబ్బట్లు), వివిధ రకాల తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. తెలంగాణలోని కేటిదొడ్డి మండలంతో పాటు, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సరిహద్దు ప్రాంతాలలో కూడా ఈ మట్టెద్దుల అమావాస్యను జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా కొనసాగుతోంది. పశుగ్రాసం, వ్యవసాయం సమృద్ధిగా సాగాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ రైతులు ఈ సాంప్రదాయాన్ని ఘనంగా నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>