కలెక్టర్‌కు చెప్పినా మా ఇష్టమే..! విద్యార్థులపై ఆర్టీసీ డ్రైవర్ రుబాబ్

​కలం, ‌జోగులాంబ గద్వాల : నిత్యం పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం శాపంగా మారింది. బస్సు ఆపాలని కోరినందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్ విద్యార్థులపై తీవ్రంగా రుబాబు చేసిన ఉదంతం విమర్శలకు దారితీస్తుంది. వివరాల్లోకి వెళ్తే… గద్వాల (Gadwal) మండలం గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు ప్రతిరోజు గద్వాల ఆర్టీసి బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు.

అయితే, ఈ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు చాలావరకు కళాశాల వద్ద ఆపకుండా వెళ్ళిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​తాజాగా, బస్సును ఆపాల్సిందిగా విద్యార్థులు కోరగా బస్సు డ్రైవర్ బండిని నిలపకుండా దురుసుగా ప్రవర్తించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. తమ ఇబ్బందులను వివరిస్తూ, ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నగా… “కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే మేమేం చేయాలి? మా ఇష్టం వచ్చినట్లే వెళ్తాం” అంటూ డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చినట్లు విద్యార్థులు ఆరోపించారు.

జరిగిన ఘటన పై గద్వాల ఆర్టీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. రవాణా సౌకర్యం లేక చదువులకు ఇబ్బందిగా మారిందని, జిల్లా కలెక్టర్ స్పందించి బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>