ఏసీబీ వలకు చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ AE

కలం, కరీంనగర్ బ్యూరో: ​పెద్దపల్లి జిల్లాలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. తాజాగా ఓ మున్సిపల్ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం జిల్లాలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ​పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ అధికారులు మరోసారి వణుకు (Peddapalli ACB Raid) పుట్టించారు. వర్క్ బిల్లు మంజూరు చేయడం కోసం ఓ కాంట్రాక్టర్ నుండి ఏకంగా రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశాడు మున్సిపల్ ఏఈ సతీష్.

​లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధిత కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ​దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ జి. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం పక్కా ప్లాన్‌తో దాడి చేసింది. ​కాంట్రాక్టర్ నుండి మున్సిపల్ ఏఈ సతీష్ రూ. 2 లక్షలు నగదు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ​ప్రస్తుతం నిందితుడైన ఏఈ సతీష్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అతని కార్యాలయంలో, నివాసంలో మరిన్ని సోదాలు జరుపుతున్నట్లు, దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>