గ్రీన్ సిమెంట్‌కు శ్రీకారం? లోకేష్ ట్వీట్ వైరల్

కలం, వెబ్ డెస్క్ : సిమెంట్ సాధారణంగా బూడిద రంగులో ఉంటుంది.. కానీ అది పర్యావరణహితంగా “గ్రీన్”గా మారగలదా? అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.`#ChooseSpeedChooseAP`, #RayalaseemaRising` హ్యాష్‌ట్యాగ్‌లతో ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

భూమికి మేలు చేసేలా సుస్థిర విధానంలో సిమెంట్ తయారు చేసే కొత్త మార్గానికి రేపు శంకుస్థాపన చేయనున్నట్లు లోకేశ్ తెలిపారు. సిమెంట్ తయారు చేసే ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది” అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ కొత్త ప్రాజెక్టు కడపలో (Kadapa) ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>