కలం, వెబ్ డెస్క్ : తిరుపతి (Tirupati) నగర శివారులో మరోసారి చిరుత సంచారం (Leopard Sighting) కలకలం రేపుతోంది. ఉపాధ్యాయ నగర్ ప్రాంతంలో చిరుత తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. శేషాచలం అటవీ ప్రాంతానికి (Seshachalam Forest) సమీపంలో ఉన్న నివాస ప్రాంతాల వద్ద చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో స్థానికులలో భయం మరింత పెరిగింది. అటవీ ప్రాంతానికి సమీపంలో నివాసాలు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత కదలికలపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, పరిస్థితిని పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

