నేడు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లైంతన మత్స్యకారుల కుటుంబాలను, అలాగే ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా జగన్ పరామర్శించనున్నారు. దీనికోసం కాసేపట్లో తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు.

షెడ్యూల్ ప్రకారం..  ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు బాధితులను జగన్ పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే కారి చిన్నాను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, అధినేత పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. జగన్ పర్యటనకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉ:ది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>