ఆయనకు సారీ చెప్పిన కేటీఆర్.. కారణమిదే!

కలం, కరీంనగర్ బ్యూరో: రిటైర్డ్ ఇంజినీర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యాంను పరిశీలించి మాట్లాడారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ఇటీవల రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ రెడ్డి సీఎంకు లేఖ రాస్తే.. తిట్టడమేంటన్నారు.

తనను ఉద్దేశించి జైలుకు పంపించాలంటూ రేవంత్ రెడ్డి అనడంపై శ్యాం ప్రసాద్ రెడ్డి బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. తాను ఆయనకు ఫోన్ చేసి, రాజకీయ వ్యవస్థ తరఫున సారీ చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాటలను పట్టించుకోవద్దని కోరినట్లు వివరించారు.

లోయర్ మానేర్ డ్యాం పరిశీలన..

ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి కేటీఆర్ లోయర్ మానేరు డ్యాంను పరిశీలించారు. ‘షాబాద్ సైకోకు రేవంత్ రెడ్డికి తేడా లేదు. కన్నెపల్లి వద్ద వరద ఉంది.. ఎందుకు పంపులు ఆన్ చేయడం లేదు. రేవంత్ సర్కారుకు రైతులంటే పట్టింపు లేదు. వెంటనే కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయకపోతే మంచి నీటి సమస్య తప్పదు.

సీఎం రేవంత్ రేవంత్ ముఖ్యమంత్రిగా కాకుండా చిల్లరగా మాట్లాడుతున్నాడు. రోజుకు తొమ్మిది టీఎంసీల నీరు దిగువకు వృథాగా పోతోంది. మేడిగడ్డ పైన 18 కిలోమీటర్ దూరంలో కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు ఉంది. మేడిగడ్డతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది’ అన్నారు.

ఏం పీక్కుంటావో పీక్కో..

ఎల్లంపల్లి నుంచైనా నీళ్లు ఎత్తిపోయకుంటే హైదరాబాద్ నగరానికి మంచినీటి సమస్య వస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే హైదరాబాదులో రోజుకు 15 వేల ట్యాంకర్ల వాటర్ సప్లై చేయాల్సి వస్తుంది. మా రక్తం పొలాల్లో చల్లితే పంటలు పండుతాయంటున్నాడని.. రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాపై కేసులు పెట్టి ఏం పీక్కుంటావో పీక్కో. కానీ రైతులను, ప్రజలను ఇబ్బంది పెట్టకు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి నీటి సమస్యను తీర్చండి’ అని డిమాండ్ చేశారు.

కేవలం 85 టీఎంసీల నీరే ఉంది..

గోదావరిపై ఆధారపడి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల కెపాసిటీ 418 టీఎంసీలు అని కేటీఆర్ అన్నారు. ‘ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 85 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. రాబోయే వంద రోజులు నీటిని లిఫ్ట్ చేస్తే అన్ని ప్రాజెక్టుల నుంచి తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి నీళ్లు పోయినా భద్రాచలం పట్టణానికి ఏం కాలేదు. 9 టీఎంసీల నీళ్లు పోతే భద్రాచలం కొట్టుకు పోతుందా?.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిమితంగా నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చని చెప్పింది. అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలోనే పోలవరం కడుతున్నారు. అక్కడికి మాత్రం తనిఖీలకు వెళ్లరు’ అని కేటీఆర్ మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>