కలం, నిర్మల్ : రాష్ట్రంలో పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం ముట్టడికి వెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు (AAP Leaders Arrested). రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, జిల్లా జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, జిల్లా ట్రెజరర్ అబ్దుల్ సాధిక్తో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించకపోవడంతో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వెంటనే పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా చేపట్టిన నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆప్ నాయకులు ఆరోపించారు.

