వాళ్లను అందుకే చంపేశా.. రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో!

కలం, వెబ్ డెస్క్: షాబాద్ (Shabad) మండలంలో భార్యా పిల్లలతో సహా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన రాజ్ కుమార్ కొత్తూరు మండలం పంజర్ల శివారులో విగతజీవిగా కనిపించాడు. అతడి పక్కన పాయిజన్ బాటిల్ కనిపించింది. చనిపోవడానికి కంటే ముందు రాజ్ కుమార్ తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకోవడం సంచలనంగా మారింది. సీపీ తరుణ్ జోషి మీడియా ఎదుట కొద్ది సెకండ్ల వీడియో ప్లే చేసి కొంత చూపించగా.. హత్యలకు గల కారణాలను అందులో చెప్పాడు.

అమ్మాయి మోసం చేసింది..

‘అమ్మాయి నన్ను మోసం చేసింది. వారి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాను. అప్పుల పాలయ్యాను. చివరికి నా ఇద్దరు పిల్లలకు భూమి లేకుండా పోయింది. పైగా నాపై కేసు పెట్టి, జైలుకు వెళ్లేలా చేశారు. అందుకే అమ్మాయి కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నా’ అని వీడియోలో పేర్కొన్నాడు. సెల్ ఫోన్‌లో గ్యాలరీ ఇంకా పూర్తిగా తాము తెరవలేదని.. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామని సీపీ తరుణ్ జోషి తెలిపారు.

Read Also: భద్రాచలం వారధి.. గుండెలను పిండేసే కన్నీటి కథకు 62 ఏళ్ళు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>