36 గంటల్లోనే వీడిన మర్డర్ మిస్టరీ.. నిందితుడి అరెస్ట్..!

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ( Huzurabad Murder ) లోని మామిండ్లవాడకు చెందిన చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హుజూరాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి తెలిపారు. హత్య జరిగిన కేవలం 36 గంటల్లోనే ఈ కేసును చేయించినట్లు వివరించారు. సోమవారం హుజూరాబాద్ పోలీసు స్టేషన్ లో హత్య కేసు వివరాలను ఆమె వెల్లడించారు.

ఏసిపి చెప్పిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత (35) గత కొంతకాలంగా హుజూరాబాద్ మామిండ్లవాడలో నివాసం ఉంటుంది. ఆమె భర్త కుమార్ మృతి చెందగా, గత ఐదు సంవత్సరాలుగా మోతే కిరణ్ తో సహజీవనం చేస్తుంది. వీరిద్దరు మామిండ్లవాడ గ్యాస్ గోదాం సమీపంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. సునీత తన పక్కన ఉన్న ఇంట్లో ముతోజు భాగ్య అనే మహిళతో స్నేహం పెంచుకుంది. తరచూ వీరిద్దరు కలిసి తిరుగుతుండటంతో సునీత వ్యభిచారం చేస్తుందనే అనుమానం కిరణ్ కు కలిగింది. ఈ అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ నెల 10న కిరణ్, సునీత ఇద్దరు కలిసి మద్యం సేవించి ఇదే విషయమై మళ్లి గొడవకు దిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన కిరణ్ ముందుగా సునీత గొంతును చేతులతో పిసికి, అనంతరం చిర ముక్కతో గొంతు బిగించి, కాలితో మెడపై తొక్కి హత్య చేశాడు. ఎవరికి తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సునీత మృతదేహాన్ని ఎత్తుకొని వెళ్లి తన స్నేహితురాలైన ముతోజు భాగ్య ఇంటి సమీపంలోని బావిలో పడేశాడు. సునీత ధరించిన లో దుస్తులు (ప్యాంట్, డ్రాయర్) ను బావికి సమీపంలోని చెట్టు వద్ద పడవేసి, అక్కడి నుంచి పరారై కరీంనగరకు వెళ్లిపోయాడని ఏసిపి పేర్కొన్నారు.

సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఏసిపి తెలిపారు. ఈ నెల 13న సోమవారం హుజూరాబాద్ కు తిరిగి వచ్చాడనే పక్కా సమాచారం అందటంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, స్వచ్ఛందంగా నేరాన్ని ఒప్పుకున్నాడన్నారు. సంఘటన జరిగిన ఇంటిని, మృతదేహాన్ని పడవేసిన బావిని, దుస్తులు పడవేసిన స్థలాన్ని చూపించాడని తెలిపారు. సంఘటన స్థలం నుంచి పగిలిన గాజులు, గాజు ముక్కలు, పుస్తెల పూసలు, కాలి పట్టి తదితర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

అలాగే బావి సమీపంలో పడవేసిన మృతురాలి లో దుస్తులను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చామన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మహిళ హత్య కేసును కేవలం 36 గంటల్లోనే ఛేదించి నిందితుడిని పట్టుకున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ కరుణాకర్, ఎస్ఐ లు రవి, శ్రీనివాసరావు, సిబ్బంది మోహన్, అవినాష్, మహేందర్, శ్రీధర్, అనిల్ లను ఏసిపి అభినందించారు.

,Read Also: షాబాద్ ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>