కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో కర్ణుడి పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలకు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) స్పందించారు. ద్రోణ పర్వంలోని ఓక పేజీని షేర్ చేసి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. “అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇవి. దయచేసి మహాభారతాన్ని చదవండి. బిబేక్ దెబ్రాయ్ అనువాదాన్ని లేదా గూగుల్‌లో చూడండి.. కృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో తెలుసుకోండి” అని పేర్కొన్నారు.
కర్ణుడి శక్తి, అతని సామర్థ్యాల గురించి మహాభారతంలో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ నాగ్ అశ్విన్ తన పోస్టును పంచుకున్నారు. “మన చరిత్రపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. పార్ట్ 2 కోసం వేచి ఉండండి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడి పాత్రను చూపించిన విధానంపై కొంతమంది అభిమానులు, నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో నాగ్ అశ్విన్ స్పందన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా సెకండ్ పార్ట్‌లో కథ మరింత విస్తరించనుండటంతో నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

