కలం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్త జనసంద్రంగా మారింది. వరుస సెలవులు రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ధర్మ దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. అదే సమయంలో కొండపైకి వాహనాలు పోటెత్తడంతో కొండ కిందే నిలిపేశారు. కొండ కింద లక్ష్మి పుష్కరిని పరిసర ప్రాంతాల్లో ఇసుక పోస్తే రాలనంత జనాలున్నారు.
ఆలయ పరిసర మాడ వీధులన్నీ హరిహర కీర్తనలు నామాలతో మారుమోగిపోయాయి. స్వామి వారి నిత్య కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులను తీర్చుకున్నారు. ఆదివారం ఆదాయం రూ.66,22,052,00 సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.

