పాము కాటుతో గొర్రెల కాపరి మృతి

కలం, చండూరు (‎గట్టుప్పల్): నల్గొండ జిల్లా గట్టుప్పల్ (Gattuppal) మండలం అంతంపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గొర్రెల కాపరి కొమ్ము సత్తయ్య (70) పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సత్తయ్య గొర్రెలను మేపేందుకు పొలాలకు వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని పాము కాటేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు వెంటనే మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సత్తయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>