కలం, భూపాలపల్లి: అతి చిన్న వయసులోనే పలువురు చిన్నారులు.. మార్షల్ ఆర్ట్స్ రంగంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో గోల్డ్ మెడల్ సాధించి పలువురి ప్రముఖులచే అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా మొగుళ్లపల్లి కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మూగ రాజ్ కుమార్ తనయుడు, మూగ రిత్విక్ తేజా, మరో ముగ్గురి చిన్నారులను ఆదివారం మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అభినందించారు. కంప్యూటర్ యుగంలో విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తున్న అతి చిన్న వయసు పిల్లలను చూసి మంత్రి సంబరపడ్డారు.
అదేవిధంగా చిన్నారులు మారుమూల ప్రాంతం నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా నలుగురి చిన్నారులకు క్యాష్ రివార్డ్ అందజేశారు. అలాగే అటు చదువులో ఇటు మార్చల్స్ రంగంలో తనదైన ముద్ర వేసేలా ప్రోత్సహిస్తున్న రిత్విక్ తేజా తండ్రి, ఏఆర్ కానిస్టేబుల్ రాజకుమార్ ను మంత్రి సురేఖ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ లు అభినందించారు.

