కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. ఆదివారం తానూర్ మండలంలోని మసల్గాతండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల పాలనలో పేదలకు ఇండ్ల మంజూరుపై సరైన దృష్టి పెట్టకపోవడంతో ముధోల్ నియోజకవర్గంలోని అనేక నిరుపేద కుటుంబాలు సొంతింటి కోసం ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అర్హత గల కుటుంబం సొంతింటి కలను సాకారం చేసుకునేలా తన (Mudhole MLA) వంతు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. తానూర్ మండలంలో గ్రామీణ రహదారులు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి హామ్ పథకం కింద రూ. 140 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే రహదారి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అన్నారు.
Read Also: జానకి లాంటి సింగర్ మళ్లీ పుట్టదు: పి. సుశీల
Follow Us On: Instagram

