ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన పోరాటం

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కొత్తగూడ మండలం ముష్మి గ్రామంలో ప్రేమ వ్యవహారం వివాదానికి దారితీసింది. అన్నారం పెద్దతండాకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో జిమ్నాస్టిక్ ట్రైనర్‌గా పనిచేస్తుంది. అదేగ్రామానికి చెందిన నేవీ గార్డుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని యువతి చెబుతోంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని కోరగా, తనకు ఇప్పటికే మరో సంబంధం కుదిరిందని, రూ.70 లక్షల కట్నం వస్తోందని చెప్పి పెళ్లికి నిరాకరించినట్లు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌన నిరసన చేపట్టింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also: జానకి లాంటి సింగర్ మళ్లీ పుట్టదు: పి. సుశీల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>