అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి అడ్లూరి

కలం, గొల్లపల్లి: ధర్మపురి  (Dharmapuri) నియోజకవర్గ అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Lakshman Kumar) అన్నారు. ఆదివారం జగిత్యాల (Jagtial) జిల్లా గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామంలో కంకణాల వసంత – లక్ష్మణ్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. నూతన గృహప్రవేశం చేసిన దంపతులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

గొల్లపల్లి మండలం రంగధాముని పల్లి గ్రామానికి చెందిన పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు మహేందర్ తమ్ముడు మనోహర్ వివాహ విందు వేడుకల్లో మంత్రి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవుల ప్రవీణ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండగా మంత్రి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) ఆదివారం పరామర్శించారు. ప్రవీణ్ కు మెరుగైన వైద్యం అందించడానికి తన వంతుగా సహకరిస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Read Also: కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి: కొండా సురేఖ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>