రక్త పిశాచిగా మారిన రేవంత్ రెడ్డి: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి రక్త పిశాచిగా మారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పంటలపై చల్లుతానంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా రక్త పిశాచి.. ఇంకా తీరలేదా మీ రక్తదాహం?.. 60 ఏళ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా.. సరిపోలేదా?.. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?’ అని ప్రశ్నించారు.

నర హంతకులు.. రాక్షసులు మీరు!

తెలంగాణ బిడ్డల్ని ఎన్ కౌంటర్ల పేరుతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి నెత్తుటేళ్లు పారించిన నర హంతకులు మీరంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు.’1952లో ఏడుగురు, 1969లో 369 మందిపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు.. మలిదశ పోరాటంలో వెయ్యి మందిని బలి తీసుకున్న మృగాలు మీరు.. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచాయి’ అని విమర్శించారు.

మా రక్తం పంపిస్తాం.. నీళ్లు ఇవ్వు!

సీఎం రేవంత్ రెడ్డికి తమ రక్తం ఎంత కావాలో పంపిస్తామని.. రైతులకు నీళ్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాం. నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం.. నెత్తురు ఇస్తేనే, నీళ్లు ఇస్తామని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం. మీ రక్తదాహం తీర్చుకుని, ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి!’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>