కలం, వెబ్ డెస్క్ : ఒంగోలు నగరంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Ongole Road Accident) చోటుచేసుకుంది. మహిళా వైద్యులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించడంతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానిక వివరాల ప్రకారం.. ఒంగోలులో జరుగుతున్న గైనకాలజిస్టుల రాష్ట్ర సదస్సుకు హాజరైన కొందరు మహిళా వైద్యులు, నగరంలోని ఒక కాఫీ షాప్‌నకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో వారి కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డుపై వేగంతో దూసుకెళ్లిన ఈ కారు, సైకిల్‌పై వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మరియదాసును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరియదాసు అక్కడికక్కడే మృతి చెందారు.
కారు అంతటితో ఆగకుండా ముందుకు దూసుకెళ్లి రోడ్డుపై ఉన్న ఒక చెత్త ఆటోను, అలాగే మరో ద్విచక్ర వాహనాన్ని సైతం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్నవారితో పాటు మొత్తం ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును, వాహనాల ధ్వంసాన్ని ఆయన పరిశీలించారు. ఈ ఘటనపై తాలూకా సీఐ టి. విజయ్ కృష్ణ కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?
Follow Us On: X(Twitter)

