కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు శుభవార్త అందుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ (Komuravelli Railway Station) అందుబాటులోకి రానుంది. కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ను ఈ నెల 26న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం జరిగిన రోజు నుంచే ఈ స్టేషన్‌లో రైళ్లు రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

ఈ మేరకు ఈ నెల 26 నుంచే సికింద్రాబాద్ – సిద్దిపేట మధ్య కొమురవెల్లి (Komuravelli) మీదుగా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు రైళ్లు నడవనున్నాయి. తిరుగు ప్రయాణంలో సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మరో రెండు రైళ్లు అందుబాటులో ఉంటాయి. కాగా, భవిష్యత్ లో భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచేందుకు, స్టేషన్‌లో ప్రయాణికుల సదుపాయాలను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖలోని మూడు విభాగాల అధికారులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటి క్షేత్రస్థాయిలో ప్రయాణికుల అవసరాలపై అధ్యయనం చేయనుంది.

Read Also: లీకేజీలు, వైరింగ్ లోపాలను ముందే కనిపెట్టే సరికొత్త గ్యాడ్జెట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>