బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం..!

కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా బొల్లారం (Bollaram) పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్రముఖ సెంచరీ పరుపుల (Century Mattresses) గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మంటల ధాటికి గోదాంలోని భారీగా పరుపులు, ముడిసరుకు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>