కలం, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. ముంబైలోని ప్రముఖ కోకిలబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజం సర్జరీ తీసుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా ముంబై పర్యటనకు సిద్ధం అయ్యారు.
కాగా, కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని ప్రముఖ కోకిలబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో (Kokilaben Hospital) సర్జరీ జరిగింది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో కుడి భుజానికి జరిగిన సర్జరీ విజయవంతం అయింది. మరో రెండో నెలల్లో ఆయన ఎడమ భుజానికి సర్జరీ జరగనుంది. ప్రస్తుతం ఆసుపత్రిలోనే పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ సర్జరీ చేసుకున్న వెంటనే ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. ఇక నేడు నేరుగా ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్ ను పరామర్శించాలని సీఎం నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని తాజా పర్యటన ప్రతిబింబిస్తోందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.
Read Also: మళ్లీ కరోనా కలకలం.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!
Follow Us On: Instagram

