కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు (US Iran Tensions) చోటుచేసుకున్నాయి. ఇటీవల అమెరికా జరిపిన దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల వద్ద మళ్లీ అనుమానాస్పద కార్యకలాపాలు ప్రారంభమవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ధ్వంసమైన అణు కేంద్రాలను వీలైనంత త్వరగా పునర్నిర్మించేందుకు ఇరాన్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పాలకులు స్పష్టం చేశారు. తమ దేశ ప్రజల డిమాండ్‌ను కచ్చితంగా నెరవేరుస్తామని, అమెరికాపై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ ప్రకటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తీవ్రంగా స్పందించారు. తనను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే ఆ దేశంపై క్షిపణుల వర్షం కురిపిస్తామని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇప్పటికే వెయ్యి క్షిపణులను లోడ్ చేసి సిద్ధంగా ఉంచామని ట్రంప్ పేర్కొనడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ (US Iran Tensions) వాతావరణం నెలకొంది.
Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?
Follow Us On : WhatsApp

