విశాఖలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని విశాఖపట్నం(Visakhapatnam Earthquake) లో పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున గాజువాక, మంగళపాలెం సాగర్ నగర్, పెద్ద వాల్తేరు, తాటిచెట్ల పాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, హెచ్‌బీ కాలనీ, పెదవాల్తేరు కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

దీంతో స్థానిక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైనట్లు గుర్తించిన అధికారులు.. కాకినాడకు 225 కి.మీ. దూరంలో బంగాళాఖాతంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తేల్చారు. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: మళ్లీ కరోనా కలకలం.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>