కలం, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలో పేకాట స్థావరం (Gambling Den Raid)పై సీసీఎస్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి (ఎస్‌ఎం) గ్రామ శివారులో దాడులు చేపట్టింది. దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి పేకాటలో వినియోగిస్తున్న రూ.4,850 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదుతో కలిసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

