పారిశ్రామికవేత్తలుగా యువత రాణించాలి: కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో యువత, మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేలా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని నారాయణపేట (Narayanpet) జిల్లా కలెక్టర్ సీహెచ్.ప్రియాంక పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో DPIIT TGIC – TEJAS వర్క్‌షాప్‌లో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. నారాయణపేట వంటి చిన్న జిల్లాలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. విజయవంతంగా నిర్వహించిన జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను అభినందించారు.

జిల్లాలో స్టార్టప్‌ల స్థాపనకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగాలను కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు.

మరిన్ని వర్క్‌షాప్‌ల నిర్వహణ..

యువతకు ఉపయోగకరమైన వర్క్‌షాప్‌లను మరిన్ని నిర్వహించి, పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం, స్టార్టప్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, స్టార్టప్ అవకాశాలు, సపోర్ట్, నిధుల సమీకరణ అవకాశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవడం, ప్రభుత్వ మద్దతు వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవడం గురించి నిపుణులు వివరించారు.

టీజీఐఐసీ ద్వారా సేవలు..

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు ప్రభుత్వ పథకాలు, నిధుల అవకాశాలు టీజీఐఐసీ ద్వారా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామ లింగేశ్వర గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయ చంద్రమోహన్, డీఆర్డీవో వెంకట్ రాములు, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, ఎల్‌డీఎం విజయ్ కుమార్, ఎస్పీ కార్పొరేషన్ ఈఈ అబ్దుల్ ఖలీల్,, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి , టీజీఐసీ ఝాన్సీ లక్ష్మి, ఈడీసీ మేనేజర్ నవీన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నవీన్ కుమార్, ఏఓ అనిల్ కుమార్, ఈడీఎం విజయ్ కుమార్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>