కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మళ్లీ పురుడుపోసుకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే భారీ సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని శనివారం ట్రూత్ వేదికగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తనను చంపేస్తే ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
తనను హత్య చేయడానికి లేదా హత్య చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం పూనుకుంటే 1000 మిస్సైళ్లతో దాడికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా సంవత్సరం పాటు ఆ దేశంపై వేలాది క్షిపణులు, బాంబుల వర్షం కురుస్తుందన్నారు. దీనిపై ఇప్పటికే అమెరికా అధికారులకు సూచనలు జారీ చేశానని ట్రంప్ స్పష్టం చేశారు.

