కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

​కలం, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని, ఫుడ్ ఏమాత్రం బాగాలేదని మొదటి గేటు వద్ద నిరసనకు దిగారు. ఎన్నిసార్లు చెప్పినా ఆహార నాణ్యత మారడం లేదన్నారు. వర్సిటీ అధికారులు, మెస్ నిర్వాహకులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల కింద పద్మాక్షి మెస్ విద్యార్థినులు కూడా అర్ధరాత్రి పూట ఆందోళనకు దిగారు. తాజాగా మరోసారి విద్యార్థులు అదే బాటలో నడవడంతో మెస్ నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. ఆహారం నాణ్యతగా అందించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వారిని వర్సిటీ అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేయూ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>