కలం వెబ్ డెస్క్ : కేంద్రంలోని బీజేపీ(BJP) విధానాలతో చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఇబ్బందులు పడుతూ తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఢిల్లీలో పలువురు వ్యాపారులతో సమావేశమైన సందర్భంగా చిరువ్యాపారుల సమస్యలపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. సమావేశంలో వైశ్య సమాజం(Vaishya Community) వ్యక్తం చేసిన ఆవేదన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వైశ్య సమాజం నేడు నిరాశలో కూరుకుపోవడం ప్రమాదకర పరిణామమని రాహుల్ పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాల వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారాలు క్రమంగా మూతపడే పరిస్థితి ఏర్పడిందని రాహుల్ విమర్శించారు. చిన్న వ్యాపారులను(Small Traders) జీఎస్టీ(GST) విధానాలతో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇది కేవలం విధానపరమైన లోపం కాదని, ఉత్పత్తి, ఉపాధి, దేశ భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపే అంశమని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నానని రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ వ్యాపారానికి వెన్నెముకగా నిలిచిన వైశ్య సమాజానికి అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
Read Also: డీజీపీ శివధర్‌రెడ్డి నియామకంపై హైకోర్టు సీరియస్ నోటీసులు
Follow Us On: Pinterest


