కలం వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్(High Commission) కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత ప్రభుత్వం ఈ ఘటనలపై బంగ్లాదేశ్ హైకమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ(Usman Hadi) హత్య కేసు ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా మారింది.
యూనస్ ప్రభుత్వంపై ఉస్మాన్ హాదీ సోదరుడు ఒమర్ హాదీ సంచలన ఆరోపణలు చేశారు. యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు తన సోదరుడిని చంపారన్నారు. ఎన్నికల ముందు రాజకీయ అస్థిరతను సృష్టించేందుకే ఈ హత్యకు పాల్పడ్డారన్నారు. షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వాన్ని కూల్చడంలో ఉస్మాన్ హాదీ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈనెల 12న ఉస్మాన్‌పై కాల్పులు జరుగగా 18న అతను మృతి చెందాడు. అతడి మరణం తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. భారత ప్రభుత్వం ఈ ఘటనలపై గమనిస్తూ, బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వాన్ని మైనార్టీ కమ్యూనిటీల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.
Read Also: డీజీపీ శివధర్‌రెడ్డి నియామకంపై హైకోర్టు సీరియస్ నోటీసులు
Follow Us On: X(Twitter)


