కలం, వలిగొండ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా ఓటర్లకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్వో) అందించిన ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసిన తర్వాత తిరిగి బిఎల్వోలకు అందించాలని వలిగొండ (Valigonda) తహసిల్దార్ దశరథ ఓటర్లను కోరారు. మండలంలోని అన్ని గ్రామాలలో బిఎల్వోలు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారంలను అందించారన్నారు. మొత్తం ఓటర్లు 49,983 ఉండగా 29,558 ఓటర్ల ఏన్యుమరేషన్ ఫారంలను నింపి డిజిటలైజేషన్ చేయడం జరిగిందని మొత్తంగా దాదాపు 60 శాతం పూర్తయిందని అన్నారు. మరో 14 రోజులలో పూర్తిస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారంలను నింపి డిజిటలైజేషన్ పూర్తి చేయించడం జరుగుతుందని అందుకు ఓటర్లు సహకరించాలని కోరారు.
Read Also: నాకు తెలంగాణ ఫస్ట్.. తరువాతే పార్టీ : ఈటల కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

