కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అగ్నిమాపక అధికారి శివాజీ, తహసిల్దార్ రాజు, అధికారులు స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
Read Also: సీఎం సభకు ముందు జగన్ ఫ్లెక్సీ కలకలం.. ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్
Follow Us On: Instagram

