కలం స్పోర్ట్స్ : టీమిండియా సంచలన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) మరోసారి మెరిశాడు. దేశవాళీ క్రికెట్‌లో ప్రత్యర్థులను ఉతికారేశాడు. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో తొలి మ్యాచ్‌లో రికార్డ్ సృష్టించాడు. ఈ టోర్నీలో బీహార్ తరఫున బరిలోకి దిగిన బుడ్డోడు.. సెంచరీతో ఔరా అనిపించాడు. తొలి మ్యాచ్ ఆడిన వైభవ్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌తో విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) రికార్డు నెలకొల్పాడు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ సెంచరీ బాదిన అతి చిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మూడో స్థానంలో నిలవడమే కాకుండా, ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (29 బంతులు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఏబీ డివిలియర్స్ (31), అన్‌మోల్ ప్రీత్ సింగ్ (35) తర్వాత వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీతో తన పేరును నమోదు చేసుకున్నాడు. కోరే అండర్సన్, గ్రహమ్ రోజ్ కూడా ఇదే బంతుల్లో సెంచరీలు సాధించారు.
Read Also: కోహ్లీ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. ఆ మ్యాచ్‌కు నో ఎంట్రీ
Follow Us On: Sharechat


