దారుణం.. నాలుగేళ్ల బాలికపై 12ఏళ్ల బాలుడి అత్యాచారం

కలం, వెబ్ డెస్క్ : అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా ఓ 12 సంవత్సరాల బాలుడు కావడం మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ అమానుష సంఘటన ఒడిశా (Odisha)లోని నబరంగ్ పూర్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా బంధువు అయిన 12 ఏళ్ల బాలుడు.. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

బాలిక కనబడటం లేదని గమనించిన తల్లిదండ్రులు సమీపంలో వెతకగా తీవ్ర గాయాలతో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షించగా బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు దబుగావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>