కలం, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియ ఇప్పుడు వేగం పొందింది. సమాచారం ప్రకారం, ఈ అంశాన్ని కేంద్ర క్యాబినెట్(Union Cabinet) ఇవాళ జరగనున్న సమావేశంలో చర్చించి, కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి 2024వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది.చట్ట ప్రకారం 2024 జూన్ 2 నుంచి అమరావతి(Amaravati)ని రాష్ట్ర రాజధానిగా అధికారికంగా గుర్తించాల్సిన అవకాశం ఉంది.ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరుతోంది. త్వరలో ఈ నిర్ణయం అమలు చేయబడితే, అమరావతి రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి ప్రస్తుత పరిణామం రాష్ట్ర రాజధాని విషయంలో చర్చలను మరింత ఉధృతం చేస్తుందని, రాజకీయ, ఆర్ధిక పరిణామాలపై కూడా ప్రభావం చూపవచ్చని విశ్లేషణలు ఉన్నాయి.
Read Also: జనసైనికుల ఘర్షణ.. కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు
Follow Us On: Pinterest


