కలం, వెబ్ డెస్క్: అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra)కు భారీగా భక్తులు తరలుతున్నారు. గత వారం రోజుల్లోనే 1.42 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకోవడం గమనార్హం. బేస్ క్యాంపుల వారీగా భక్తులను అధికారులు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ రోజు నున్వాన్, బాలితాల్ బేస్ క్యాంపులకు 8,150 మంది భక్తుల బృందాన్ని పంపించారు.
ఇదిలా ఉంటే, భక్తులు తాకిడి విపరీతంగా పెరిగిపోవడంతో హిమలింగం కూడా వేగంగా కరుగుతోంది. దీంతో గుహ పరిసర ప్రాంతాల్లో జనసంచారాన్ని తగ్గించేేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
భారీగా భద్రత ఏర్పాట్లు..
అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర పారామిలటరీ బలగాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మందికి పైగానే విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద వ్యక్తులపై ఏఐ సాయంతో నిఘా వేసి తనిఖీలు చేపట్టారు.
మరీ ముఖ్యంగా జమ్మూ హైవేపై భద్రతను కట్టుదిట్టం చేశారు. భగవతీ, బాలితాల్, పహల్గాం బేస్ క్యాంపుల నుంచి ప్రధానంగా భక్తులను మంచు లింగ దర్శనానికి పంపిస్తున్నారు. జులై మూడో తేదీన ప్రారంభమైన యాత్ర ఆగస్ట్ 9న ముగియబోతుంది.

