కలం, హనుమకొండ: హనుమకొండ (Hanamkonda) జిల్లా హంటర్ రోడ్డులోని డి లైట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హోటల్ గదిలో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న 8 మంది పేకాటరాయుళ్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 33,430 నగదుతోపాటు 10 మొబైల్ ఫోన్లు, ఒక క్రెటా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: మూసీ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ!
Read Also: డిజిటల్ వారసులు

