కలం, వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని దస్తగిరిపల్లె గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు పోలీస్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎండీ అంకుస్ (59) (ASI Ankus) తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆయన మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: మూసీ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ!
Read Also: డిజిటల్ వారసులు

