70లోనూ అదే జోష్.. మెగాస్టార్ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా

కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టార్ డైరెక్టర్ బాబీ (Bobby) కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘మెగా158’ (Mega158) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్‌తో  దర్శకుడు బాబీ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాపై మరోసారి తన అంకితభావాన్ని చాటుకున్నారు.

వర్షంలో చిత్రీకరిస్తున్న అత్యంత క్లిష్టమైన యాక్షన్ సన్నివేశం కోసం ఏకధాటిగా 12 గంటల పాటు షూటింగ్ చేశారు. భారీ వర్షం మధ్య తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో (Mega158) హైలైట్‌గా నిలవనుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సన్నివేశం సహజంగా రావడానికి చిరంజీవి ఎలాంటి విరామం లేకుండా గంటల తరబడి షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. దీనితో  70 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తున్న చిరంజీవిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also : రైలులో శోభనం డెకరేషన్.. టీటీఈపై వేటు

Read Also: డిజిటల్ వారసులు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>