35 దాటిన మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ ముప్పు.. కారణాలివే!

కలం, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ (Female Infertility) ప్రజారోగ్య సమస్యగా మారుతోందని ‘ది లాన్సెట్’ జర్నల్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. 2023లో 53.6 మిలియన్లుగా ఉన్న 35-49 ఏళ్ల వయస్సు గల బాధితుల సంఖ్య, 2036 నాటికి దాదాపు 80 మిలియన్లకు పెరగవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మొత్తం 204 దేశాల డేటాను విశ్లేషించిన ఈ నివేదిక ప్రకారం.. ఆలస్యంగా మాతృత్వం పొందాలనుకోవడం, వృద్ధాప్యం పెరగడం, మారుతున్న జీవనశైలి కారణాలుగా మారుతున్నాయి. అత్యధిక జనాభా కలిగిన తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ నివేదిక చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. కాకపోతే పునరుత్పత్తి ఆరోగ్యంపై ముందస్తు అవగాహన పెంచుకోవడానికి హెచ్చరిక అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మహిళల్లో 35 ఏళ్ల తర్వాత అండాల సంఖ్య, నాణ్యత సహజంగానే తగ్గడం వల్ల గర్భధారణ అవకాశాలు క్షీణిస్తాయని గుర్తించారు. కేవలం మహిళలనే కాకుండా పురుషుల వంధ్యత్వం కూడా ఇందులో సగం మేర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. స్థూలకాయం, ధూమపానం, ఒత్తిడి లాంటి వైద్యపరమైన సమస్యలు కూడా కారణమవుతున్నాయి. మెరుగైన జీవనశైలిని అలవర్చుకోవడం, సకాలంలో సంతాన సాఫల్య చికిత్సలను తీసుకోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ (Female Infertility) ముప్పుని తగ్గించవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

Read Also: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>