కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జోన్-III పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి యూనిట్లకు సంబంధించిన పోలీస్ సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించే జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ (Police Duty Meet) విజయవంతంగా ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక పోటీలలో ఫోరెన్సిక్ సైన్స్, ఇన్వెస్టిగేషన్ లాస్, ఫింగర్ ప్రింట్ సైన్స్, సైబర్ అవగాహన, క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ, వివిధ రకాల సెర్చ్ ఆపరేషన్లతో కూడిన మొత్తం 21 విభాగాలలో సిబ్బందికి కఠినమైన పరీక్షలు నిర్వహించారు.
ఈ డ్యూటీ మీట్ (Police Duty Meet) ద్వారా పోలీస్ శాఖలో పరిశోధనా ప్రమాణాలను పెంచడం, అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పించడం మరియు సిబ్బందిలో దాగి ఉన్న ఉత్తమ ప్రతిభను గుర్తించడం ప్రధాన ఉద్దేశం. ఈ పోటీలలో వివిధ విభాగాల వారీగా అత్యంత ప్రతిభ కనబరిచిన విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి ఆరు ప్రధాన విభాగాలైన ఫోరెన్సిక్ సైన్స్ (లిఖితపూర్వక పరీక్ష), క్రైమ్ ఇన్వెస్టిగేషన్ & క్రిమినల్ లాస్, మెడికో లీగల్ టెస్ట్, లిఫ్టింగ్ & ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్, ఫింగర్ ప్రింట్స్ సైన్స్ లలో ఇన్‌స్పెక్టర్ ఎమ్. సంపత్ కుమార్ (కామారెడ్డి), సీఐ ప్రదీప్ కుమార్ (కరీంనగర్), సీఐ. నాగేశ్వరరావు (రాజన్న సిరిసిల్ల)లతో పాటు ఎస్ఐల విభాగంలో బి. వంశీకృష్ణ (కరీంనగర్), వి. రఘుపతి (సిద్దిపేట), ఎన్. రమాకాంత్ (రాజన్న సిరిసిల్ల), ఐ. భార్గవ్ (కామారెడ్డి), జి. నరేందర్ రెడ్డి (కరీంనగర్), వి. లక్ష్మణ్ (రాజన్న సిరిసిల్ల) ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
పోలీస్ పోర్ట్రైట్, అబ్జర్వేషన్ టెస్ట్ విభాగాలు..
పోలీస్ పోర్ట్రైట్, అబ్జర్వేషన్ టెస్ట్ విభాగాలలో సిద్దిపేటకు చెందిన ఏఎస్ఐ మధుసూదన్ ప్రథమ స్థానంలో నిలవగా, పోర్ట్రైట్ లో కామారెడ్డికి చెందిన పీసీ ఎస్. లక్ష్మీనారాయణ గౌడ్, అబ్జర్వేషన్ లో కరీంనగర్ కు చెందిన పీసీ పి. భార్గవ్ తదుపరి స్థానాలు దక్కించుకున్నారు. రక్షణ, శోధన (Search Operations) విభాగాలలో కామారెడ్డికి చెందిన పీసీ పి. రాంచంద్రం వెహికల్ సెర్చ్, రూమ్ సెర్చ్ లలో అగ్రస్థానంలో నిలిచారు.
వెహికల్ సెర్చ్, రూమ్ సెర్చ్ విభాగాలు..
వెహికల్ సెర్చ్ లో రాజన్న సిరిసిల్లకు చెందిన పీసీ ఎ. హరీష్, రూమ్ సెర్చ్ లో కామారెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ. పీఎన్ సాయి ప్రసన్న ప్రతిభ చాటారు. గ్రౌండ్ సెర్చ్ లో కరీంనగర్ కు చెందిన పీసీ డి. ఎల్లయ్య, సిద్దిపేటకు చెందిన పీసీ ఎన్. నగేష్ విజేతలుగా నిలిచారు. యాక్సెస్ కంట్రోల్ లో కామారెడ్డికి చెందిన పీసీ ఎస్. వెంకటేష్, మెదక్ కు చెందిన పీసీ కె. సిద్ధి రాములు, ట్రాకింగ్ విభాగంలో మెదక్ కు చెందిన పీసీ బి. మహేష్, సిద్దిపేటకు చెందిన పీసీ జి. శంకర్ విజయాలు సాధించారు.
పేలుడు పదార్థాలు, నార్కోటిక్స్ విభాగాలు..
పేలుడు పదార్థాల (Explosive) శోధనలో రాజన్న సిరిసిల్లకు చెందిన పీసీ కె. కిరణ్, సిద్దిపేటకు చెందిన పీసీ పి. వెంకటేష్, నార్కోటిక్స్ విభాగంలో మెదక్ కు చెందిన పీసీ ఇ. శ్రవణ్ కుమార్, సిద్దిపేటకు చెందిన పీసీ పి. అజయ్ తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, కంప్యూటర్ అవేర్‌నెస్ మరియు ఆఫీస్ ఆటోమేషన్ లలో మెదక్ కు చెందిన పి.సి. ఎస్. సతీష్ కుమార్, సిద్దిపేటకు చెందిన పి.సి. యు. భాస్కర్, కరీంనగర్ కు చెందిన పి.సి. జి. సాగర్ ముందుండగా, ప్రోగ్రామింగ్ ఎబిలిటీలో సిద్దిపేటకు చెందిన పి.సి. పి. రమేష్, రాజన్న సిరిసిల్లకు చెందిన పి.సి. జి. రాజశేఖర్ విజేతలుగా నిలిచారు.
పీపీటీ, ఫోటోగ్రఫీ విభాగాలు..
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సిద్దిపేటకు చెందిన పీసీ ఎ. హరికృష్ణ ప్రథమ స్థానం సాధించారు. చివరగా, పోలీస్ ఫోటోగ్రఫీ పోటీలో కరీంనగర్ కు చెందిన ఏఆర్ పీసీ బి. మల్లేష్, మెదక్ కు చెందిన పీసీ ఎన్. శ్రీధర్ గౌడ్ విజయం సాధించగా, పోలీస్ వీడియోగ్రఫీ పోటీలో మెదక్ కు చెందిన పీసీ ఎన్. శ్రీధర్ గౌడ్ ప్రథమ స్థానంలో, కరీంనగర్ కు చెందిన పీసీ కె. మల్లేష్ ద్వితీయ స్థానంలో నిలిచారు.
డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరిచిన విజేతలందరినీ పోలీస్ కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ ప్రథమ స్థానాల్లో నిలిచిన విజేతలు త్వరలో జరగబోయే “రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్” లో జోన్-III తరపున ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్ జి, వేణుగోపాల్, వెంకటస్వామి, ఇతర జిల్లాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: అర్జెంటీనా సంచలన విజయం.. కోచ్ స్కలోని ఎమోషనల్
Follow Us On: X(Twitter)

