Mobile Popup Ad
Mobile Popup Ad

హీరోయిన్ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్ట‌ర్‌తోనే..!

క‌లం, వెబ్ డెస్క్‌: అష్టాచెమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి (Actress Swati) రెండో పెళ్లి చేసుకొని స‌రికొత్త బంధంలోకి అడుగు పెట్టింది. స్వాతి పెళ్లి చేసుకున్న‌ది ఓ డైరెక్ట‌ర్‌ని అని తెలిసి అంద‌రూ షాక‌వుతున్నారు. మొద‌టి పెళ్లి అనంతరం చాలా గ్యాప్ తర్వాత మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో స్వాతి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ నాగోటి (Sreekanth Nagothi)నే స్వాతి నేడు పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. శ్రీకాంత్‌ను ట్యాగ్ చేస్తూ పెళ్లి చేసుకున్నాం అని క్యాప్ష‌న్ జోడించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

స్వాతి (Actress Swati) 2018లో వికాస్ వాసు అనే మలయాళీ పైలెట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయి. మంత్ ఆఫ్ మ‌ధు సినిమా తెర‌కెక్కుతున్న త‌రుణంలోనే స్వాతి భ‌ర్త‌తో విడిపోతున్న‌ట్లు రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. కానీ, స్వాతి అప్పుడు దీనిపై ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఇక కొద్ది రోజుల‌కు అధికారికంగా విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తాజాగా శ్రీకాంత్ నాగోటితో పెళ్లి ఫోటోలు పెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఏదేమైనా త‌న న‌ట‌న‌, యాంక‌రింగ్‌తో అల్ల‌రి పిల్ల‌గా ఆడియెన్స్‌కు చేరువైన స్వాతి మ‌ళ్లీ కొత్త జీవితం ప్రారంభించ‌డంపై నెటిజ‌న్లు సంతోషం వ్య‌క్తం చేస్తూ విషెస్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు సైతం స్వాతికి విషెస్ చెప్పారు.

Read Also: రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు అదిరిపోయే టైటిల్?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>