Mobile Popup Ad
Mobile Popup Ad

‘టాక్సిక్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. పిచ్చేక్కిస్తున్న యశ్, కియారా రొమాన్స్!

కలం, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్ల్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ‘తబాహి’ అనే ఫస్ట్ సింగిల్‌ను (Toxic First Single) మేకర్స్ విడుదల చేశారు.

ఇప్పటివరకు యాక్షన్ మోడ్‌లో కనిపించిన యశ్‌ని రొమాంటిక్ యాంగిల్‌ను ఈ పాట ఆవిష్కరిస్తోంది. ప్రేమలో పడతానని ఊహించని ఒక వ్యక్తి జీవితం, కియారా పాత్ర పరిచయంతో ఎలా మారిపోయిందనే కథాంశంతో ఈ సాంగ్ సాగుతుంది.

యశ్, కియారా అద్వానీల మధ్య కెమిస్ట్రీ మ్యాజికల్‌గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ కంపోజర్, సింగర్ విశాల్ మిశ్రా ఈ రొమాంటిక్ ట్రాక్‌ను కంపోజ్ చేయడమే కాకుండా తన గాత్రంతో ఆకట్టుకున్నారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి. యశ్ స్టైలిష్ లుక్, కియారా అద్వానీ గ్లామర్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. యశ్ గత చిత్రాలకు భిన్నంగా రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి కనిపించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Read Also: రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు అదిరిపోయే టైటిల్?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>