కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫారెస్ట్ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. వేర్వేరు ఘటనల్లో ఆడ పులి, చిరుత మృతి చెందడం దురదృష్టకరమని, రెండు ఘటనలపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వన్యప్రాణుల ప్రమాదాలు నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. వన్యప్రాణుల రక్షణను ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, ముఖ్యంగా అటవీ మార్గాల వెంట ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఇటీవల ప్రకాశం జిల్లా, మార్కాపురం(Markapuram) అటవీ డివిజన్ పరిధిలో వాహనం ఢీకొని ఆడ పులి, ఆదోని రేంజ్‌లో రైలు ఢీకొని చిరుత మృతి చెందిన ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రమాదాలపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అటవీ సరిహద్దు మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేర్వేరు ఘటనల్లో ఆడ పులి, చిరుత మృతిపై అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఒకే రోజు రెండు ప్రమాదాల్లో పులి, చిరుత ప్రాణాలు కోల్పోవడం బాధించింది. అడవులు, వన్యప్రాణి సంచార మార్గాలకు సమీపంగా ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్ల వద్ద ప్రమాదాల (Accidents) నివారణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హైవే అథారిటీ, రైల్వే, పోలీస్ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాలి’’ అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు.
Read Also: నేటి నుంచి మూడు రోజులు బంద్
Follow Us On: X(Twitter)


