Mobile Popup Ad
Mobile Popup Ad

తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం : మంత్రి పొంగులేటి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు మతిభ్రమించి మాట్లాడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఘాటు విమర్శలు చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన (Ponguleti) మాట్లాడుతూ.. పేదవాడికి అండగా, అంకిత భావంతో పాటు పడతారని రాష్ట్ర ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని బలపరిచిందని, ప్రజల నమ్మకాన్ని తల తాకట్టు పెట్టీ అయిన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, తద్వారా పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గుడిసెల్లో నివసించే పేద కుటుంబాలకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు.

గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత గృహం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తూ, రాష్ట్రంలో గృహరహితులు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 8.21 లక్షల కోట్ల అప్పు భారం మోపినప్పటికీ గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు మంత్రి (Ponguleti Srinivasa Reddy) చెప్పారు.

ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రైతును రాజు చేయాలనే సంకల్పంతో రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున 9,300 కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. రైతులు పండించిన సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా అందిస్తున్నట్లు తెలియజేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.63 వేల కోట్లు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు తెలియజేశారు.

ఇక ఉద్యోగాల విషయానికొస్తే ఇప్పటికే 72,000 ఉద్యోగాలను భర్తీ చేశామని త్వరలోనే మరో 22 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక, మట్టి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, వీటి విషయంలో పేదలను ఇబ్బంది పెట్టకుండా ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారులు వెంటనే గృహ నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల విషయంలో ప్రతి అప్లికేషన్ వెరిఫై చేసి పరిష్కరించే దిశగా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.

సంక్షేమ పథకాలకు పెద్ద పీట : మంత్రి జూపల్లి

అనంతరం జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మాట్లాడుతూ, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఉన్న పథకాలను ఏమాత్రం తీసివేయకుండా వాటికి అదనంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు అత్యంత పారదర్శకంగా కొనసాగుతున్నాయని ప్రశంసించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియలు లబ్ధిదారులు తమకు నిర్దేశించిన పరిమితుల్లోనే ఇల్లు కట్టుకోవాలని, అప్పులు చేసి ఇండ్లు కట్టవద్దని సూచించారు. వనపర్తి నియోజకవర్గంతో పాటుగానే కొల్లాపూర్ నియోజక వర్గానికి అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని పొంగులేటిని కోరారు.

పేదలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తున్నాం : మంత్రి వాకిటి శ్రీహరి

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. సుమారు రూ.60 వేల కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల పాలు చేశారని విమర్శించారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.

గుడిసెల్లో నివసించే కుటుంబాలందరికీ శాశ్వత గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ‘వివరణ ఇచ్చేదే లేదు’.. మంత్రి సురేఖకు కడియం కౌంటర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>