కలం, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba-Tharun Bhascker) హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరి పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తామిద్దరం ప్రేమలో ఉన్నామనే పుకార్లపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ స్పందించారు. ఈషా తనకు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువని, తమ బంధం గురించి సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని క్లారిటీ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ క్రేజీ కాంబో తమ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
త్వరలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా పెళ్లి??
-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా
-గత కొంతకాలంగా ఈ జంట ప్రేమించుకుంటున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్
Tharun Bhascker and Eesha Rebba Joint Appearance… pic.twitter.com/Z5AkKBlFxw— Kalam Daily (@kalamtelugu) July 8, 2026
Read Also: ‘టాక్సిక్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. పిచ్చేక్కిస్తున్న యశ్, కియారా రొమాన్స్!
Follow Us On: Instagram

